Sunday, September 16, 2007

నా తొలి తెలుగు బ్లాగు

మొదటిసారిగా నేను తెలుగులో రాసిన బ్లాగు ఇది.Weekend చాలా busy గా ఉంది. అమ్మా , నాన్న 5 నెలలు ఇక్కడ వుండి మొన్ననే ఇండియా తిరిగి వెళ్లారు. ఇల్లంతా బోసిగా వుంది. అమ్మ చేతి వంట మిస్సవుతున్నాను.రోజూ పొద్దున్నే లేచెసరికి రడీ అయ్యే చక్కటి టిఫిన్ , మసాలా టీ , లంచ్ కి డిన్నర్ కి రెండు మూడు రకాల కూరలు .. No matter how she cooks అమ్మ ఎప్పుడూ నంబర్ 1 Cook ( I think this is applicable to every Mother). అమ్మ చేతి వంట నచ్చని వారుండరేమో ! నా ఇద్దరు కొడుకులు ( 7 మరియు 4 సం.లు) వాళ్లు ఉన్నన్ని రొజులు దగ్గరికి కూడ వెళ్లలేదు .. వెళ్లాక మాత్రం అప్పుడే ఎందుకు వెళ్ళారు అని వచ్చీ రాని తెలుగు లొ అడుగుతున్నారు.. (మన పిల్లలకు పూర్తిగ తెలుగు రాకపొవటం మన భావదారిద్ర్యం !చెప్పుకోడానికి కూడా సిగ్గు చేటు ! ) ఎప్పటినుండో అనుకుంటున్నాను , కమ్యూనిటిలో ఉన్న తెలుగు పిల్లకాయల్ని పొగేసి మా బేస్‌మెంట్‌లో తెలుగు పాఠాలు చెబుదామని , కదరటం లేదు ..త్వరలో వీలు చూసుకొని మొదలు పెట్టాలి !